ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి సేవలో చాగంటి కోటేశ్వరరావు

ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుడు బ్రహ్మాశ్రీ చాగంటి కోటిశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బుధవారం కుటుంబసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన ఈరోజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం వకూళమాతను, జ్వాలనరసింహస్వామిని దర్శించుకొని హుండిలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు చాగంటి కుటుంబానికి వేదాశీర్వాదం అందజేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.



