తెలంగాణ
Bandi Sanjay: క్రికెటర్‌గా మారిన కేంద్రమంత్రి బండి సంజయ్

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ క్రికెటర్‌గా మారి అలరించారు. హుస్నాబాద్ మర్రి ఎక్స్ రోడ్ సమీపంలో యువకులు నిర్వహిస్తున్న ‘యూనిటీ కప్’ క్రికెట్ టోర్నమెంట్‌ను చూసి ఆయన తన కాన్వాయ్‌ను ఆపారు. వందలాది మంది యువత కేరింతల మధ్య మైదానంలోకి వెళ్లిన కేంద్ర మంత్రి, క్రీడాకారుల కోరిక మేరకు బ్యాట్ పట్టారు. యువకులు వేసిన బంతులను బౌండరీలు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
క్రీడలు శారీరక దృఢత్వానికి కాకుండా ఐక్యతకు దోహదపడతాయని బండి సంజయ్ అన్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా, క్రీడా స్ఫూర్తితో ప్రశాంతంగా ఆడుకోవాలని యువతకు సూచించారు. కేంద్ర మంత్రి స్వయంగా మైదానంలోకి వచ్చి క్రికెట్ ఆడటంతో స్థానిక యువతలో నూతనోత్సాహం నెలకొంది.



