తెలంగాణ

సంక్రాంతి కి సొంతూళ్లకు .. హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad: సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లెబాట పట్టారు నగరవాసులు. దీంతో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుండి వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి, కొర్లపహాడ్,గూడూరు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుంది.వాహనాల రద్దీ దృష్ట్యా టోల్ ప్లాజాల వద్ద ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ టోల్ ప్లాజా సిబ్బంది,ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పంతంగి టోల్ ప్లాజా లో ఉన్న 16 టోల్ గేట్లలో వాహనాల రద్దీ దృశ్య 11 టోల్ బూతులను విజయవాడ వైపు,హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్ లను తెరిచి ఉంచారు అధికారులు.సాధారణ రోజులలో రోజుకు టోల్ ప్లాజాల గుండా 35,000 నుండి 40000 వాహనాలు వెళ్తాయని,సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే 60 వేల వాహనాలు వెళ్లినట్లు ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు.

నేడు, రేపు జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు,టోల్ ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు.టోల్ బూతులలో స్కానింగ్ తొ పాటు హ్యాండ్ గాన్ తో స్కాన్ చేస్తూ వాహనాలు పంపిస్తున్నారు. ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున నిమిషానికి 20 వాహనాలు గంటకు 120 వాహనాలు విజయవాడ మార్గంవైపు వెళ్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button