తెలంగాణ
KCR: పేద విద్యార్థులకు అండగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్

KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లికి చెందిన పలువురు రైతులు ప్రమాదవశాత్తు మరణించగా.. వారి బిడ్డలకు మాజీ సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. స్థానికంగా బీటెక్ చేస్తున్న రైతుల బిడ్డల పూర్తి ఫీజులను కేసీఆర్ చెల్లించారు. వారికి అవసరమయ్యే పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు వారికి విడి విడిగా చెక్కులు అందించారు.
మంచిగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకోవాలని ఫీజుల కోసం భయపడొద్దని ఏ సమస్య వచ్చిన అండగా ఉంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తమ చదువుకోసం భరోసాగా నిలిచిన కేసీఆర్కు ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.



