తెలంగాణ
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుకాణాల బంద్

ప్రజా చైతన్య వేదిక పిలుపు మేరకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుకాణాల బంద్ కొనసాగుతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో ఓట్ల అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తూ.. వ్యాపార వాణిజ్య దుకాణాలను మూసివేశారు. ఓట్ల అవకతవకలను నిరసిస్తూ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ తీయనున్నట్లు వ్యాపారులు తెలిపారు. ర్యాలీ తర్వాత దుకాణాలు యధావిధిగా తెరుచుకొనున్నట్లు వెల్లడించారు.



