ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్లకు బ్రేక్

Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన దివ్యదామం తిరుమల పుణ్యక్షేత్రం. స్వామి వారి దర్శనార్థం ఆంధ్ర నుండే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు చేరుకొని స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని పునీతులు అవుతుంటారు. సామాన్య భక్తుల నుంచి వీఐపీలు, వీవీఐపీల వరకు దర్శనానికి క్యూ లైన్ ద్వారా స్వామి వారి దర్శనానికి చేరుకోవాల్సిందే. స్వామి వారిని ఒక్కసారైనా అతి దగ్గరగా కన్నులారా చూసి తరించాలన్నది ప్రతి భక్తుని మదిలో మేదిలే ఆశ సిఫారసులతో పని లేకుండా శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసారు. అనతి కాలంలోనే ఈ ట్రస్ట్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.

తిరుమలలో ఆఫ్‌లైన్ విధానంలో జారీచేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను త్వరలో ఆన్‌లైన్‌లోకి మార్చేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సిఫార్సు లేఖలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో భక్తులు 10 వేల 500 శ్రీవాణి దర్శన టికెట్ల కోసం పోటీపడుతున్నారు. మూడు నెలల ముందుగా ఆన్‌లైన్‌లో రోజుకు 500 టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచుతుండగా భక్తులు క్షణాల్లో బుక్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆఫ్‌లైన్ లో ఏ రోజుకారోజు తిరుమలలో 800, తిరుపతి విమానాశ్రయంలో మరో 200 టికెట్లను జారీ చేస్తున్నారు.

శ్రీవాణి దర్శన టికెట్ల కోసం నేరుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అన్నమయ్య భవనం ఎదుట ఉన్న ఆఫ్‌లైన్ జారీ కేంద్రం వద్ద ఉదయం ఆరు గంటలకు టికెట్లు ఇస్తుండగా భక్తులు ముందురోజు రాత్రి ఏడు గంటల నుంచే వేచి ఉంటున్నారు. అప్పటివరకు గదులు దొరక్క కుటుంబ సభ్యులందరూ ఆరు బయట వేచి ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఈ కోటా పరిమితంగా ఉండటంతో టికెట్లు రాని భక్తులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది.

శ్రీవాణి టికెట్ల జారీలో నెలకొంటున్న ఇబ్బందులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితోపాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో సహా పలువురు ఉన్నతాధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ఓ అధ్యయన కమిటీని చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలో పాలకమండలి ఇటీవల నియమించింది, ఆ కమిటీ సిఫార్సు చేసిన నివేదికలో ఆఫ్‌లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్ల జారీతో ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో ఈ విధానం రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఆఫ్‌లైన్ విధానాన్ని రద్దు చేస్తే ఆ టికెట్లను భక్తులకు ఏవిధంగా కేటాయించాలనే దానిపై నిపుణులతో మరో కమిటీని నియమించారు. దాని సిఫార్సుల మేరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండకుండానే టికెట్లను కొనుగోలు చేసుకునేలా ఏరోజుకారోజు 800 టిక్కెట్ల కోటాను ఉదయం 9 గంటలకు టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేస్తారు.

సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్ట్ చేయగలవారు. ఆన్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ కు నగదు చెల్లించి దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని ఈ నెల‌ 9 నుండి భక్తులకు టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. 1+3 ఒక బుకింగ్ ద్వారా నలుగురు మించకుండా శ్రీవాణి దర్శన టిక్కెట్లు పొందేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఈ విధానంలో ఎదురయ్యే లోటుపాట్లను పరిశీలించి సరిచేసాకా.

తిరుమలలో జారీచేసే 800 శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోటాను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచబోతుంది టీటీడీ.మరోవైపు తిరుపతి ఎయిర్‌పోర్ట్ లో ఆఫ్‌లైన్ లో జారీ చేసే 200 శ్రీవాణి దర్శన టిక్కెట్లు కోటా యధావిధిగా కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button