తెలంగాణ
మురికి కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. షాబునగర్లో మురికి కాలువలో శిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. కాలువలో చెత్త తొలగిచే క్రమంలో పసిబిడ్డను గుర్తించిన పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చిరు. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆడశిశువు కావడంతోనే నెలలు నిండకుండానే అబార్షన్ చేయించి పసిబిడ్డను కాలువలో వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.



