Sara Arjun: తొలి చిత్రంతోనే టాప్ హీరోయిన్ గా మారిన సారా!

Sara Arjun: బాల్య నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్గా అడుగుపెట్టింది. రణవీర్ సింగ్ సరసన తొలి సినిమా ‘ధురంధర్’లో నటించి 1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్‌లో భాగమైంది. ఈ విధంగా డెబ్యూ చిత్రంతోనే అరుదైన రికార్డు నమోదు చేసింది.
ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ కూడా నటుడే. ఒకటిన్నర ఏళ్ల వయసులోనే టీవీ యాడ్‌లో కనిపించింది. 2011లో వచ్చిన తమిళ చిత్రం ‘దైవ తిరుమగల్’ (తెలుగులో ‘నాన్న’)లో విక్రమ్ కూతురిగా నటించి ప్రేక్షకుల గుండెల్ని ఆకట్టుకుంది.
రాజేంద్రప్రసాద్ ‘దాగుడుమూత దండాకోర్’లో మనవరాలిగా, మలయాళంలో ‘ఆన్ మరియా కలిప్పిలాను’లో నటించి గుర్తింపు పొందింది. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 1, 2’లో యంగ్ ఐశ్వర్యారాయ్ పాత్రలో ఆకట్టుకుంది. ఇప్పుడు 20 ఏళ్ల వయసులో ‘ధురంధర్’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. రణవీర్ సింగ్ సరసన నటించి తొలి చిత్రంతోనే 1000 కోట్ల బ్లాక్‌బస్టర్ సాధించిన హీరోయిన్గా చరిత్ర సృష్టించింది.



