తెలంగాణ
శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్పోస్ట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మన్ననూర్ చెక్పోస్ట్ పరిధిలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అమలు చేయడంతో శ్రీశైలంకు వెళ్తున్న భక్తుల వాహనాల తనిఖీలు చేపట్టారు అధికారులు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపోవడంతో హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై వాహనాల రద్దీ మరింత పెరిగింది. ట్రాఫిక్ జామ్ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్లాస్టిక్ నిషేధ నిబంధనలకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.



