తెలంగాణ
Harish Rao: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది

Harish Rao: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. కార్మికులతో కలసి లక్డీకాపూల్‌లోని సింగరేణి కార్యాలయానికి హరీష్ రావు వెళ్లారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి అధికారులకు వినతిపత్రం అందించారు. సింగరేణి పైసలతో సీఎం ఫుట్‌బాల్ ఆడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై విచారణ జరుపుతామన్నారు.



