తెలంగాణ
కొండగట్టు అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలోనే సుమారు 20 వేల మందికి పైగా భక్తులు అంజన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఆలయ అధికారులు.



