తెలంగాణ

Karimnagar: పురుగుల మందు తాగించి.. గొంతు పిసికి కూతురి హత్య

Karimnagar: కరీంనగర్ జిల్లాలో పరువు హత్య జరిగింది. కూతురు కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని బుకాయించిన తల్లిదండ్రుల వ్యవహారం పోలీసుల విచారణలో నిజాలు నిగ్గుతేల్చేలా చేసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న తమ కూతురు ..పెళ్లైన ఓ వ్యక్తితో ప్రేమలో పడటం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించారు. అయితే అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెతో పురుగుల మందు తాగించడమే కాకుండా గొంతు నులిమి చంపేశారు.

అమ్మాయిని చంపేశాక ఏమీ తెలియనట్లు కూతురు పురుగుల మందు తాగి చనిపోయిందన్నారు. కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి కేసును విచారించారు. ఇన్వెస్టిగేషన్‌లో టీనేజ్ అమ్మాయి తల్లిదండ్రులే హత్యకు పాల్పడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. శివరాంపల్లిలో తల్లిదండ్రులే తమ కూతురును హత్య చేశారని పోలీస్ విచారణో తెలియడంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button