తెలంగాణ
Hyderabad: ఏఐ టెక్నాలజీతో మాస్ కాపీయింగ్

Hyderabad: ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు ఇద్దరు యువకులు ప్రయత్నించడం సంచలనంగా మారింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు యువకులు మాస్ కాపీతో అడ్డంగా దొరికిపోయారు.
బటన్ స్కానర్లతో ప్రశ్న పత్రాన్ని ఏఐ సహాయంతో బ్లూటూత్ ద్వారా పరీక్షలు రాయసాగారు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు.



