ఆంధ్ర ప్రదేశ్

గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్దపులి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పెద్దపులి అక్కడికక్కడే మరణించిన ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. సిరిగిరిపాడు గ్రామ శివారులోని ఎన్‌హెచ్ 565పై.. తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఘటనపై కేసు నమోదు చేసి, పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇదిలా ఉంటే అటవీ జంతువుల సంరక్షణ కోసం జాతీయ రహదారులపై వేగ నియంత్రణ చర్యలు, హెచ్చరిక బోర్డులు, వైల్డ్‌లైఫ్ క్రాసింగ్ సూచికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button