సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రోషన్ కనకాల

Tirumala: తిరుమల శ్రీవారిని సినీ యువ కథనాయకుడు రోషన్ కనకాల దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆయన అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.



