తెలంగాణ

Narsingi: సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి నిరసన

Narsingi: పంచాయతీ ఎన్నికల జరుగుతుండగా సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కిన నిరసన తెలిపిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి పరిధిలోని పెద్ద తండాలో చోటు చేసుకుంది. గ్రామంలో ప్రత్యర్థి ఓటుకు 2 వేలు చొప్పున డబ్బులు పంపిణీ చేశారని, తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఆరోపిస్తూ అభ్యర్థి సెల్ టవర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగారు.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా స్పాట్‌కు చేరుకుని అభ్యర్థిని బుజ్జగించి కిందకు దించే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థులు డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని సదరు అభ్యర్థి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాను చేసిన ఆరోపణలపై వెంటనే ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ హఠాత్పరిణామంతో పెద్ద తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button