తెలంగాణ
టీడీపీ నేత పై కత్తులతో దాడి

హైదరాబాద్‌లో ఏపీ టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. సుపారీ గ్యాంగ్‌తో అంతమొందించేందుకు కుట్ర జరిగింది. దగదర్తి టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్‌పై హైదరాబాద్‌లో హత్యాయత్నానికి పాల్పడ్డారు. నెల్లూరులో కత్తులు కొనుగోలు చేసిన నిందితులు శ్రీకాంత్‌పై హైదరాబాద్‌లో దాడికి పాల్పడ్డారు.
అయితే వారి దాడి నుంచి శ్రీకాంత్ తృటిలో తప్పించుకున్నాడు. గాయపడిన శ్రీకాంత్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మాలేపాటి రవీందర్ నాయుడు, మాలేపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, కంచర్ల రమేష్ కుమార్లపై కేసు నమోదైంది.



