ఆంధ్ర ప్రదేశ్
Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి

Road Accident: తిరుపతి జిల్లా నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట వద్ద రెండు కార్లు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రికి తరలించారు.
మృతులు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు ఇద్దరు మృతిచెందగా, మరొకరు తమిళనాడుకు చెందిన అరుణ్‌గా గుర్తించారు. కారు అతివేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.



