గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం ఒమర్‌ను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్

హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని జమ్ముకశ్మీర్ హౌస్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కలిశారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన గ్లోబల్సమ్మిట్ఆహ్వాన పత్రికను ఒమర్ అబ్దుల్లాకు అందజేశారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపిన ఒమర్ అబ్దుల్లా సమ్మిట్‌కు ప్రత్యేక్షంగా హాజరు కాలేకపోతున్నానని సమ్మిట్ విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
3 ట్రిలియన్డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు వివరించారు. నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు.. అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు.



