ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో క్రికెట్ ఫీవర్

విశాఖలో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇవాళ భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది ఏసీఏ. ఇప్పటికే నగరానికి ఇరు జట్ల ఆటగాళ్లు చేరుకున్నారు. మ్యాచ్ కోసం 15 వందల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



