అత్యంత భయకరంగా ‘ఈషా’?

Isha: బన్నీ వాస్, వంశీ నందిపాటి కాంబో మళ్లీ హర్రర్ థ్రిల్లర్‌తో వస్తోంది. ‘ఈషా’ పేరుతో డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తే హార్ట్ వీక్ వాళ్లు కూడా భయపడతారని బన్నీ వాస్ హెచ్చరించాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
బన్నీ వాస్, వంశీ నందిపాటి టీమ్ తాజాగా ‘ఈషా’ అనే హర్రర్ థ్రిల్లర్‌ను సిద్ధం చేసింది. డిసెంబర్ 12న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తుండగాహెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తుంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పిస్తున్నారు.
టైటిల్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమంలో బన్నీ వాస్ మాట్లాడుతూ దెయ్యాలు, ఆత్మలు నమ్మని తను కూడా ఈ సినిమా చూసి నాలుగుసార్లు భయపడ్డానని, ముఖ్యంగా చివరి 15 నిమిషాలు అందరి గుండెల్ని హత్తుకుంటాయని చెప్పాడు. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమా చూడొద్దని సరదాగా హెచ్చరించాడు. టికెట్ ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుందని తెలిపాడు.



