తెలంగాణ
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈనేపథ్యంలోనే సమ్మిట్ ఏర్పాట్లును టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు.
గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు నిర్మలా జగ్గారెడ్డి. వెయ్యి మందికి పైగా గ్లోబల్ డెలిగేట్స్, 500 కు పైగా కంపెనీ ప్రతినిధులు హాజరుకానున్నారని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.



