తెలంగాణ
Kavitha: ఇక్కడి ప్రజల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది

Kavitha: జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ పరిధిలోని అల్వాల్ వెంకటాపురం డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసిన కవిత వారిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పాలమూరు నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు దుర్భర పరిస్థితులలో జీవనం కొనసాగిస్తున్నారని వారి సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు కవిత. మహిళలు స్నానాలు చేసేందుకు బాత్రూంలు లేని దుస్థితి నెలకొందన్నారు.
తెలంగాణ జాగృతి తరఫున ఇక్కడి ప్రజలకు బాత్రూంలు నిర్మిస్తామన్నారు. పాలమూరు ప్రజలు ఎక్కువగా ఉన్నా ప్రాంతంలో పాలమూరు నుండి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి దృష్టి సారించాలన్నారు.



