తెలంగాణ
బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుడు దాడి

మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుడు సురేష్ సర్జికల్ బ్లెడ్తో దాడికి పాల్పడటం కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకుడి దాడిలో పిట్టల రమ్య తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రమ్య కుటుంబసభ్యులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని రమ్య ప్రచారం చేస్తుండగా ఆమెపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



