తెలంగాణ
Khammam: లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. విద్యార్థులకు స్వల్ప గాయాలు

Khammam: ఖమ్మం జిల్లా కేంద్రంలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నగరంలోని శ్రీశ్రీ హోటల్ సమీపంలో ఓ స్కూల్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. అయితే ఈప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా మిగిలిన విద్యార్థులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. విద్యార్థులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కంటైనర్ లారీకి ఆటో అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేశాడు లారీ డ్రైవర్. వెనుక వస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్ ఇది గమనించకుండా లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



