తెలంగాణపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన కవిత

తెలంగాణ వాదుల దిష్టికల్లతో కోనసీమ పాడయింది అని పవన్ కళ్యాణ్ అనడం హాస్యాస్పదమన్నారు. కోనసీమ చాలా బాగుందని కోనసీమ లాగానే తెలంగాణ కూడా ఉండాలి అని కోరుకున్నామే తప్ప, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నామె తప్ప ఏనాడు కూడా ఆంధ్రకు వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు .గతంలో ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశా నేను అని కవిత అన్నారు .ఆంధ్ర బాగుంటే మేము కూడా బాగుంటామే తప్ప ఆంధ్రాపై ఎప్పుడు కన్నెర్ర చేయలేదు .
అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాబట్టి ఏమన్నా నడిచింది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు .ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడినా ప్రజలను ఉద్దేశించి వారి అభివృద్ధి కోసం మాట్లాడే తప్ప వేరే మాట్లాడొద్దని హితవు పలికారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న హామీలు ఉద్యమకారులు ఇవ్వని ఎడల ప్రభుత్వం భూములను కైవసం చేసుకుని జాగృతి జెండాలు పాతుతామని హెచ్చరించారు కవిత..



