తెలంగాణ
Nizamabad: దొంగల బీభత్సం.. 14 తులాల బంగారం, వెండి, లక్ష నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు 14 తులాల బంగారం, అరకిలో వెండి, లక్ష నగదు సొత్తు ఎత్తుకెళ్లారు. నవంబర్ 27 వేరే ఊరికి వెళ్లిన పుల్లెల రాము కుటుంబం ఊరి నుంచి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడటంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



