పవన్ ఫ్యాన్స్ జోష్ ఫుల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలో రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వస్తున్న ఈ పాట ఈ డిసెంబర్లోనే రిలీజ్ కానుంది. వీడియో గ్లింప్స్‌తో ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ రిలీజ్ అయింది. మూవీలోని ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించి ఓ గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు.
వీడియోలో వింటేజ్ లుక్‌లో సూటు వేసుకుని పవన్ కళ్యాణ్ కనిపించడంతో ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి చార్ట్‌బస్టర్ సాంగ్ ఇస్తారని అంచనా. “డిసెంబర్ నెలను సెలబ్రేట్ చేసుకుందాం” అంటూ మేకర్స్ పోస్ట్ పెట్టారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



