ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

Tirumala: తిరుమల శ్రీవారిని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శివ ప్రతాప్ శుక్లా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు పండితులు వేదాశీర్వాచనం అందజేయగా అధికారులు స్వామివారి పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు.



