ఆంధ్ర ప్రదేశ్
Nellore: పెంచలయ్య హత్యకు నిరసనగా నెల్లూరు జిల్లాలో బంద్

Nellore: ప్రజా నాట్య మండలి సభ్యుడు, సీపీఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా నెల్లూరు జిల్లాలో బంద్ జరుగుతోంది. సీపీఎం, అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు బంద్ కు మద్దతు తెలిపాయి. స్థానిక గాంధీ బొమ్మ వద్ద గంజాయి డ్రగ్స్, మహమ్మారి దిష్టిబొమ్మను సీపీఎం కార్యకర్తలు, పెంచలయ్య కుటుంబ సభ్యులు దహనం చేసి ర్యాలీ నిర్వహించారు. గంజాయిని తరిమికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో నెల్లూరు నగరంలో పలు స్కూల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి.



