తెలంగాణ

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం హాజరుకాబోతున్నారు. అయితే ఈ టూర్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలతో సమావేశం అయి వారితే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button