News
YS Jagan: అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన జగన్

YS Jagan: అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. జగన్‌తో పాటు మాజీ మంత్రి విడదల రజిని, తలశిల రఘురాం, పేర్ని నాని, వైసీపీ నేతలు వచ్చారు. విచారణ నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.



