సినిమా

నయనతారకు 10 కోట్ల కార్ గిఫ్ట్!

నయనతార నిన్న 41వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. భర్త విఘ్నేశ్ శివన్ మరోసారి లగ్జరీ కారును బహూకరించారు. ఈసారి రూ.10 కోట్ల కారుని గిఫ్ట్ గా ఇచ్చారు.

నవంబర్ 19న 41 ఏళ్లు పూర్తి చేసుకున్న నయనతారకు భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. గత మూడేళ్లుగా పుట్టినరోజు సందర్భంగా విఘ్నేశ్ లగ్జరీ కార్లనే గిఫ్ట్ చేస్తూ వస్తున్నారు. 2023లో మెర్సిడెస్ మేబాచ్, 2024లో బెంజ్ మేబాచ్ GLS 600 ఇచ్చిన ఆయన ఈ ఏడాది గిఫ్ట్ విలువను రెట్టింపు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ మోడల్‌గా గుర్తింపు పొందిన ఈ కారు స్పోర్టీ లుక్, హై-ఎండ్ ఇంటీరియర్స్‌తో అద్భుతంగా ఉంటుంది. నయనతార, విగ్నేష్, తమ పిల్లలు కొత్త కారుతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అభిమానులు “ఇండస్ట్రీ బెస్ట్ కపుల్” అంటూ పోస్టులు పెడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button