జాతియం
యానాం సర్కిల్ ఇన్స్పెక్టర్ సస్పెండ్

యానాం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ అడలరసన్ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి ఐజీ పి. అజిత్ కుమార్ సింగ్లా ఉత్తర్వులు జారీ చేశారు. పోక్సో కేసులో ముద్దాయిని పుదుచ్చేరి జైలుకు తరలించి గురువారం రాత్రి తిరిగి వస్తూ పోలీసు వ్యాన్లో సీఐ డ్యాన్స్ చేశారు. ఆ దృశ్యాన్ని తానే తన వ్యక్తిగత గ్రూపులో అప్లోడ్ చేశారు. అయితే మద్యం తాగి డ్యాన్స్ చేశారని పుదుచ్చేరి మీడియాలో వైరలైంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.



