సినిమా

మోగ్లీ డైరెక్టర్ హృదయవిదారక పోస్ట్!

Sandeep Raj: నేషనల్ అవార్డు గెలిచిన యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ మళ్లీ తీవ్ర నిరాశలో మునిగారు. తన రెండో చిత్రం మోగ్లీ రిలీజ్ కష్టంగా మారింది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ నాడే అఖండ 2 రాబోతుందని టాక్. దీంతో థియేటర్లు దక్కకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు సాధించిన సందీప్ రాజ్‌కు రెండో సినిమా మోగ్లీ మళ్లీ చుక్కలు చూపిస్తోంది. రోషన్ కనకాల హీరోగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా, అఖండ 2 వాయిదా పడి అదే తేదీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో బాలయ్య సినిమా బలం ముందు చిన్న సినిమాకు స్క్రీన్లు దొరక్కపోవడం ఖాయం. దీంతో మోగ్లీ టీమ్ కొత్త డేట్ కోసం వెతుకుతోంది. ఈ పరిణామాలతో భగ్గుమన్న సందీప్ రాజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

“నేనే బ్యాడ్ లక్ ఏమో, సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తోందేమో” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి సినిమా ఓటీటీలోకి పోవడం, ఇప్పుడు రెండోది ఢీ కొట్టడంతో వెండి తెరపై తన పేరు చూసుకునే కల నెరవేరడం కష్టమవుతోందని బాధపడ్డారు. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డీఓపీ మారుతి, భైరవ తదితరుల కష్టం కోసమైనా సినిమాకు మంచి జరగాలని ఆశపడుతున్నానని ముగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button