Australia: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

Australia: సోషల్ మీడియా మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ఇప్పుడు అది లేని రోజులను కూడా ఊహించుకోలేం. ఈ తరంలో అది మరీ ఎక్కువైపోయింది. కొంత మంది పిల్లలు సోషల్ మీడియా కారణంగా స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారు. మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ దేశంలో డిసెంబర్ 10 నుంచి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ దేశం ఏంటి..? ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటి..? మరీ ఇండియాలో ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు.
సోషల్ మీడియా లేనిదే మనిషి ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇప్పుడు అది మనిషి జీవితంలో భాగం. భోజనమైన తినకుండా ఉంటారేమో కానీ స్మాట్ ఫోన్, సోషల్ మీడియా లేనిది ఇప్పటి రోజుల్లో ఎవ్వరూ ఉండడం లేదు. అయితే.. సోషల్ మీడియాతో జరిగే మంచితో పోల్చితే చెడే ఎక్కువగా ఉంటుంది. అది కూడా పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపుతోంది. కొంత మంది పిల్లలు సోషల్ మీడియా కారణంగా స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు.
మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఈ కారణంతో చాలా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు సంబంధించి కొత్త రూల్స్ ను రూపొందిస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని భావిస్తోంది. ఈ డిసెంబర్ 10 నుంచి ఈ బ్యాన్ ను చేయాలని చూస్తున్నారు. ఇకపై పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించలేని మొట్ట మొదటి దేశంగా ఆస్ట్రేలియా అవతరించనుంది.
ఈ దేశంలో అమలు చేస్తున్న వయో పరిమితులు ఇప్పుడు 16 ఏళ్లలోపు పిల్లలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా సైట్‌లను వినియోగించకుండా నిషేధించాయి. జుగుప్సాకరమైన వీడియోలు, బెదిరింపులు, ఒత్తిడి లాంటి హానికరమైన విషయాల నుంచి పిల్లలను సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ లాంటి యాప్‌లు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని గుర్తించింది.
వారి సమయాన్ని వృథా చేయడంతో పాటు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని డెన్మార్క్ ప్రభుత్వం గుర్తించింది. ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ జూన్ 2021 డేటా ప్రకారం.. ఆస్ట్రేలియాలో దాదాపు 4.04 మిలియన్ల మంది 16 ఏళ్లలోపు వారు ఉన్నారు. ఈ సమూహం మొత్తం జనాభాలో దాదాపు 16శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది. దీంతో ఇప్పుడు దేశంలో దాదాపు నాలుగు మిలియన్ల సోషల్ మీడియా ఖాతాలు నిషేధించనున్నట్లు తెలుస్తుంది.
ఆస్ట్రేలియాలో ఈ నిషేధం డిసెంబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో అప్పటి నుంచి దేశంలోని టీనేజర్లు సోషల్ మీడియాను ఉపయోగించలేరు. ప్రపంచంలోనే టీనేజర్లను సోషల్ మీడియాను వినియోగించకుండ నిషేధించిన మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించనుంది. ఇప్పటికే దేశంలో ఈ నిషేధాన్ని అమలు చేయడానికి సన్నాహాలు వేగవంతం అవుతున్నాయి. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు రాబోయే రోజుల్లో పది లక్షలకు పైగా ఆస్ట్రేలియన్ టీనేజర్లకు సందేశాలను పంపుతాయి. వారి డేటాను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని, వారి ప్రొఫైల్‌లను స్తంభింపజేసే అవకాశాన్ని, డేటాను కోల్పోయే అవకాశాన్ని అందిస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఇక ఈ నిర్ణయం చట్టంగా మారితే సోషల్ మీడియా యాప్‌లు వినియోగదారుల వయస్సు తనిఖీ చేయాల్సి ఉంటుంది. 16 ఏళ్లలోపు పిల్లలు అకౌంట్స్ కలిగి ఉండటానికి అనుమతించబడరు. 13, 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు వారి తల్లిదండ్రుల అంగీకారంతో సోషల్ మీడియాను ఉపయోగించవచ్చు. ఈ నిబంధనల గురించి ఇప్పటికే డెన్మార్క్ పార్లమెంటులో చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ నిర్ణయం చట్టరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.
డిజిటల్ ప్రపంచం పిల్లల మానసిక ఆరోగ్యానికి, అభివృద్ధికి హాని కలిగించకుండా చూసుకోవడానికి దేశంలో ఈ నిషేధం విధించినట్లు ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. ఆన్‌లైన్ భద్రతా సవరణ బిల్లు 2024 ప్రకారం.. మైనర్లు ఫేస్ బుక్, ఇస్టాగ్రామ్, టిక్ టాక్, స్నాప్ చాట్, యూ ట్యూబ్, ట్వీట్టర్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఖాతాలను సృష్టించడం లేదా నిర్వహించడం నిషేధం. ఇది డిసెంబర్ 10, 2025 నుండి అమల్లోకి వస్తుంది.
ఇది దాదాపు 200,000 మంది ఆస్ట్రేలియన్ వినియోగదారులను కలిగి ఉన్న టిక్‌టాక్, అనుమానిత మైనర్ వినియోగదారులను నివేదించడానికి ఒక బటన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పార్లమెంటుకు తెలిపింది. ఇతర యాప్‌లు కూడా వివిధ వయస్సు-గుర్తింపు లక్షణాలను వారివారి యాప్‌లలో అభివృద్ధి చేస్తున్నాయి. కొన్ని యాప్‌లు సెల్ఫీల ఆధారంగా వయస్సును అంచనా వేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రధాని తెలిపారు.
డెన్మార్క్ పాలకులు పిల్లల మానసిక పరిణతి గురించి ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా పిల్లల ఆలోచనలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియా యాప్ లలో ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లలు ఆందోళనకు గురి కావడంతో పాటు చూపును కోల్పోవచ్చు. తమను తాము ఇతరులతో పోల్చుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఆన్ లైన్ లో చూసే విషయాల కారణంగా తమ గురించి తాము చెడుగా భావిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పటి యువత సాధారణంగా ఇలాంటి నిషేధాలను ప్రతిఘటిస్తారు. ఈ ప్రతిఘటన తల్లిదండ్రులు, పిల్లల మధ్య విభేదాలకు దారి తీస్తుంది, వ్యక్తుల మధ్య ఒత్తిడి, అపనమ్మకం సృష్టించవచ్చు. సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాలు కేవలం పుకార్లు కాదు. చిన్న వయస్సులో ఎక్కువ స్క్రీన్ సమయం శాశ్వత ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు.
అయితే ఇదే రూల్స్ ప్రస్తుతం ఇండియాలో కూడా అమలు చేయాలని చర్చ మొదలైంది. ఇండియాలో సోషల్ మీడియా, OTT ప్లాట్‌ఫారమ్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌ను అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు ఏకాభిప్రాయాన్ని రూపొందించాలని కోరుతున్నారు.



