ఆంధ్ర ప్రదేశ్
Chintalapudi: పాఠశాలలో దారుణం.. బ్లేడుతో విద్యార్థిపై తోటి విద్యార్థి దాడి

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలోని అంబేద్కర్ గురుకల బాలుర పాఠశాలలో దారుణ చోటుచేసుకుంది. ఆనంద్ కుమార్ అనే విద్యార్థి గొంతుపై బ్లేడుతో దాడి చేశారు గుర్తు తెలియని విద్యార్థులు. ఆనంద్ కేకలతో నిద్ర లేచిన తోటి విద్యార్థులు రక్తం మడుగులో ఉన్న ఆనంద్ చూసి భయాందోళనకు గురయ్యారు.
వెంటనే ఆనంద్‌ను చింతలపూడి ఏరియా ఆస్పత్రికి తరలించారు హాస్టల్ సిబ్బంది. విద్యార్థి గొంతుపై ఐదు కుట్లు వేశారు వైద్యులు. పోలీసులుకు సమాచారం ఇచ్చిన హాస్టల్ సిబ్బంది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదవ తరగతి చదువుతున్న ఆనంద్ అదే క్లాసులోని ఇద్దరు విద్యార్థులపై అనుమానం వ్యక్తం చేశాడు.



