తెలంగాణ

Ponnam Prabhakar: ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష

Ponnam Prabhakar: తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మీ పథకం ద్వారా లాభాల బాటలోకి వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో గురువారం సమీక్షి నిర్వహించారు మంత్రి. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు మంత్రి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని 7980 కోట్ల రూపాయలను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు.

టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై దృష్టి సారించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. బస్సు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేయాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్‌లతో పాటు ఇతర ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button