అంతర్జాతీయం

Indonesia: అతి పెద్ద ముస్లిం దేశంలో త్రిశూల్ ప్రాజెక్ట్

Indonesia: సమస్త సృష్టి కారకుడు ఆ శివుడు. కాబట్టి అతన్ని ఆది దేవుడు అని కూడా అంటారు. శివుడంటే ఆది, అనంతం రెండూ అని చెబుతుంటారు పెద్దలు. ఆ పరమాత్ముడు ఎప్పుడు చేతిలో త్రిశూలాన్ని ఆయుధంగా పట్టుకుని ఉంటాడు. భౌతిక వేడిని నాశనం చేయడానికి త్రిశూలాన్ని ఆయుధంగా చెబుతారు. శివుని త్రిశూలంలో రాజసి, సాత్విక్, తామసి అనే మూడు గుణాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా చెబుతారు.

అలాగే ఈ యావత్త్ రక్షణకు త్రిశూల్‌ ఏ మూలం కూడా. అలాంటి త్రిశూలాన్ని మనం ఎక్కువగా పూజిస్తాం ఆ పరమాత్ముడి ఆయుధాన్ని ఆరాధిస్తాం. ఇప్పుడు అలాంటి హిందూ నమ్మకాన్ని ఓ ముస్లిం దేశం ఫాలో అవుతుంది. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తొంది. ఇందులో భాగంగానే ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంతకీ హిందూ దేవుళ్లను ఫాలో అవుతున్న ఆ ముస్లిం దేశం ఏంటి..? ఆ దేశం చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ ఏంటి..?

ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం ఇండోనేషియా. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఇండోనేషియా త్రిశూల్ అనే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశాన్ని దాడుల నుంచి రక్షించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఇండోనేషియా దేశ రక్షణ వ్యవస్థ కోసం త్రిశూల్ అనే రక్షణ కవచాన్ని అభివృద్ధి చేస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇండోనేషియా తన త్రిశూల్ రక్షణ వ్యవస్థ కోసం సుమారు 125 బిలియన్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతోందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారని ఈ నివేదికలు స్పష్టం చేశాయి.

ఇండోనేషియా ప్రభుత్వం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని యోచిస్తుంది. ప్రస్తుత రాజధాని జకార్తాను నుసంతారాకు మార్చడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నుసంతారాలో త్రిశూల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రణాళిక ఇండోనేషియా కొత్త రాజధానిని బాహ్య దాడుల నుంచి కాపాడుతుందని ప్రభుత్వం తెలిపింది. త్రిశూల్ ప్రణాళిక ప్రకారం ఇండోనేషియా ప్రభుత్వం జలాంతర్గాములు, యుద్ధనౌకలు, క్షిపణి సాయుధ వేగవంతమైన దాడి నౌకలు, దీర్ఘ-శ్రేణి క్షిపణులు వంటి కొత్త పరికరాలను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రణాళిక కింద కొత్త సైనికులను నియమించుకోవడానికి ప్రభుత్వం నిబంధనలను కూడా చేర్చింది.

అలాగే ఇండోనేషియా త్రిశూల్ ప్రణాళిక కింద రెండు సెకండ్ హ్యాండ్ డస్సాల్ట్ మిరాజ్ 2000-D/ED ఫైటర్ జెట్‌లను, 24 బోయింగ్ F-15EX ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసింది. వీటిని త్వరలో ఇండోనేషియాలో మోహరించనున్నారు. అదేవిధంగా ఇండోనేషియా 24 లాక్‌హీడ్ మార్టిన్ S-70M బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, రెండు ఎయిర్‌బస్ A400M అట్లాస్ ఎయిర్‌లిఫ్టర్లు, 12 టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అంకా మీడియం-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ అన్ ఇన్హమేటెడ్ ఏరియల్ వెహికల్స్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ దేశం ఎక్కువగా తన ఆయుధాలను ఎక్కువగా అమెరికా లేదా చైనా నుంచి కొనుగోలు చేస్తుంది. వీటిలో అమెరికా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు, చైనా నుంచి చౌకైన, తేలికైన ఆయుధాలు ఉన్నాయి.

అయితే ఇదే ప్రాజెక్టును భారత్ కూడా చేపట్టింది. దీంతో ఇండియా శత్రుదేశం పాకిస్తాన్‌ గుండెల్లో వణుకుమొదలైంది. భారతదేశం పెద్ద ఎత్తున త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించింది. త్రిశూల్ 2025 ఎక్సర్‌సైజ్ పేరుతో యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. గుజరాత్ రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో, పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర త్రివిధ దళాలు పెద్ద ఎత్తున డ్రిల్స్ నిర్వహించాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మూడు దళాలు కలిసి పాల్గొన్నాయి. 20,000 మంది సైనికులతో పాటు T-90S, అర్జున్ ట్యాంకులు, రాఫెల్, సుఖోయ్ యుద్ధవిమానాలు, నేవీ నౌకలు పాల్గాన్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు పాక్ సరిహద్దుల్లోని సర్‌క్రీక్ వద్ద ఈ మిలిటరీ ఎక్సర్‌సైజ్ జరిగింది.

అయితే భారత పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తుండటంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. రెండోసారి నోటమ్ జారీ చేసింది. ఐదు రోజుల్లో పాకిస్తాన్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఇది రెండోసారి. పాక్ జాగ్రత్త, భయంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నోటమ్ హెచ్చరికలు విమానయాన సంస్థలకు ఇచ్చే హెచ్చరిక. ఈ ప్రాంతం మీదుగా విమానాలు ఎగరొద్దు అనే సమాచారాన్ని దీని ద్వారా ఇస్తారు. అలాగే పాకిస్తాన్ నవంబర్ 1 నుంచి 30 వరకు తన దక్షిణ తీర ప్రాంత గగనతలాన్ని మూసేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం పాక్ నేవీ లైవ్-ఫైరింగ్ డ్రిల్‌లు, క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా, సరిహద్దుల్లో భారత్ పెద్ద ఎత్తున విన్యాసాలు చేయడంతో భయంతో కూడా నోటమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇండోనేషియా ముస్లిం దేశం కదా ఎందుకు మరి ఆ ప్రాజెక్టుకు త్రిశూల్ అని పేరు పెట్టిందని డౌట్ రావొచ్చు. కానీ ఇండోనేషియా ఒకప్పుడు పక్కా హిందూ దేశం. ఇండియా, ఇండోనేషియా మధ్య సంబంధాలు ఈ నాటివి కాదు. వేల సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశంగా ఉంది. కానీ ఒకప్పుడు హిందూ, బౌద్ధ రాజుల పాలనలో కొనసాగింది. వాస్తవానికి అరబ్ ముస్లిం వ్యాపారులు 8వ శతాబ్దంలో ఇండోనేషియాలో అడుగు పెట్టారు. కానీ ఇస్లాం 13వ శతాబ్దంలో ప్రచారం చేయబడింది.

ప్రారంభంలో ఇస్లాంను అరబ్ ముస్లిం వ్యాపారులు, ఆ తర్వాత మిషనరీలు దేశంలో విస్తరించేలా చేశాయి. తొలి నాళ్లలో స్థానిక రాష్ట్రాలు ఇస్లాంను స్వీకరించాయి. ఆ తర్వాత పెద్ద పెద్ద కుటుంబాలు ఇస్లాంను స్వీకరించడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా ఇస్తాం విస్తరించింది. ఆ తర్వాత 13వ శతాబ్దంలో సుమత్రా ఉత్తర తీరం పూర్తిగా ఇస్లాంను స్వీకరించింది. 1292లో మార్కో పోలో చైనా నుండి తిరిగి వస్తుండగా ఇండోనేషియాలోని ముస్లిం నగరాల గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఇండోనేషియాలో సుల్తాన్ మాలిక్ అల్ సలేహ్ మొదటి ముస్లిం పాలకుడిగా సింహాసనాన్ని అధిష్టించారు.

2023లో ఇండోనేషియాలో 87.06శాతం మంది ప్రజలు ఇస్లాంను నమ్ముతారు. ఇక్కడ ఎక్కువ మంది సున్నీ ముస్లింలు ఉన్నారు. 2011లో దేశ ముస్లిం జనాభాలో 99శాతం మంది సున్నీ ముస్లింలు కాగా, మిగిలిన 1శాతం మంది షియా ముస్లింలు. ఇక్కడ 4 లక్షల మంది అహ్మదీ ముస్లింలు కూడా ఉన్నారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీలో ఉన్నప్పటికీ, ఇస్లామిక్ రాజ్యంగా పరిగణించబడలేదు. ఇండోనేషియా ప్రభుత్వం గుర్తించిన ఆరు అధికారిక మతాలతో కూడిన లౌకిక దేశంగా కొనసాగుతున్నది. ఇండోనేషియా, భారత్ కూడా సాంస్కృతిక సారూప్యతలను కలిగి ఉన్నాయి.

ఇరు దేశాల మధ్య భాష, సంస్కృతి, పురాణాల పరంగానూ ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇండోనేషియా ప్రజలు మహాభారతం, రామాయణాన్ని తమ గ్రంథాలుగా భావిస్తారు. అంతేకాదు, అక్కడి కరెన్సీ మీద కూడా భారతీయులు ఆరాధించే దేవతామూర్తుల ఫోటోలు ఉంటాయి. ఎయిర్ పోర్టులతో పాటు పలు పర్యాటక ప్రాంతాల్లో హిందూ ఇతిహాసాల్లోని ప్రముఖ ఘట్టాలను ప్రతిబింబించేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. అందుకే, ఇండోనేషియా, భారత్ మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి.

అయితే ఇండోనేషియా ఇన్ని ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏమోచ్చిందనే అనుమానం రావొచ్చు. వాస్తవానికి ఈ దేశానికి మలేషియా, ఆస్ట్రేలియాతో చిన్న చిన్న ఘర్షణలు ఉన్నాయి. అయితే ఇవి చిన్న చిన్న ఘర్షణలు మాత్రమే. ముస్లిం మెజారిటీ కలిగిన ఇండోనేషియా దేశానికి పైన పేర్కొన్న దేశాలతో తప్ప ప్రస్తుతం వేరే దేశాలతో ఘర్షణ వాతావరణం లేదు. దీనివల్ల ఇండోనేషియా కొత్త ఆయుధాలను ఎందుకు ఇంత వేగంగా కొనుగోలు చేస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది.

నిజానికి మధ్య ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండోనేషియాను ఆందోళనకు గురిచేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండోనేషియాలో 17 వేల కంటే ఎక్కువ దీవులు ఉన్నాయి. దీని వలన వాటి రక్షణ కష్టతరం అవుతుందని, అందుకే ఈ దేశం కొత్త రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రారంభించిందని అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button