తెలంగాణ
Nizamabad: వృద్ధురాలి మృతి.. బంగారం మాయం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో ఓ వృద్ధురాలు చేరింది. ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చేరిన వృద్ధురాలు మంగళవారం మరణించింది. అయితే ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారం గొలుసు చోరీకి గురైనట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందే గొలుసు చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



