ఆంధ్ర ప్రదేశ్
Nimmala Rama Naidu: జగన్కు ఇంకా బుద్ధి రాలేదు

Nimmala Rama Naidu: ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన జగన్కు ఇంకా బుద్ధి రాలేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో చంద్రబాబు ఏపీకి ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే 11.20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు, 9.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు.
ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు, లోకేష్ పనిచేస్తున్నారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.



