తెలంగాణ
Revanth Reddy: అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

Revanth Reddy: అందెశ్రీ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.
అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటని రేవంత్ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందెశ్రీ చేసిన కృషి చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు సీఎం రేవంత్.



