తెలంగాణ
ప్రవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌పై గంజాయి బ్యాచ్ దాడి

హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఆంధ్రకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారుకి బస్సు తగిలిందని బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన గంజాయి బ్యాచ్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.
భయాందోళనకు గురైన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి పారిపోయారు దుండగులు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



