Perni Nani: ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టేస్తోంది చంద్రబాబు సర్కార్

Perni Nani: రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న చంద్రబాబు ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. పెత్తందారి మనస్తత్వంతో ప్రజలకు వైద్యం, విద్య దూరం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. జగన్ పర్యటనకు వెళ్తే ఎవరి ప్రాణాలు తియవద్దని లోకేష్ వెటకారంగా మాట్లాడుతున్నారు. మీ పర్యటనల్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు మీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. మీ పాలనలో అనేక మంది ప్రాణాలు పోతే మీకు బాధ్యత లేదా అని నిలదీశారు.
ఆలయాల్లో భక్తులు చనిపోతే ప్రైవేటు గుడి అని చెప్పడానికి సిగ్గులేదా అని మండిపడ్డారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప పోలీసులు చేస్తుందేమీ లేదన్నారు. పాలన చేతకాకపోతే దిగిపోయి జగన్‌కు అప్పగించాలన్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



