ఆంధ్ర ప్రదేశ్
విజయ డెయిరీ మాజీ చైర్మన్ కన్నుమూత

విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ చైర్మన్ గా సేవలందించిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.
పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసిన ఆయన 27 ఏళ్లు విజయ డెయిరీ చైర్మన్‌గా పని చేశారు. ఆయన స్వగ్రామం మొవ్వలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.



