ఆంధ్ర ప్రదేశ్
Fire Accident: ఏపీలో మరో ప్రమాదం.. మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం

Fire Accident: ఏపీలో మరో ప్రమాదం మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధంపార్వతీపురం మన్యం జిల్లాలో ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపేయడంతో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఘటన జరిగింది.



