ఆంధ్ర ప్రదేశ్
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఉయ్యూరు బస్టాండ్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రజాపత్ (28)గా గుర్తించారు అధికారులు.



