తెలంగాణ
చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం

Bus Accident: వరుస బస్సు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్న అధికారులు చర్యలు చేపట్టడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో మరో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ముత్తంగి జాతీయ రహదారిపై డివైడర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఏం కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.



