Khammam: బ్రాందీలో పురుగుల మందు కలిపి కొడుకును చంపిన తండ్రి

Khammam: బ్రాందీలో పురుగుల మందు కలిపి కొడుకును చంపిన తండ్రిబ్రాందీలో పురుగుల మందు కలిసి కొడుకును చంపాడు ఓ తండ్రి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడి పెద్దమ్మ అయిన మరియమ్మ తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తల్లాడ మండలం కలకొడెమ గ్రామానికి చెందిన ఆదూరి రాజేష్, నాగరాజు ఇద్దరు తండ్రి కొడుకులు. తండ్రి కొడుకులు ఇద్దరు మందుకు బానిసై రోజు గొడవ పడుతుండేవారు. మద్యం సేవిస్తూ గొడవ పడుతూ తండ్రిని కొడుతుండేవాడు నాగరాజు.
ఈ క్రమంలోనే కొడుకు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న రాజేష్ దీపావళి రోజున బ్రాందీలో పురుగుల మందు కలిపి కొడుకు ఇచ్చాడు. అది తెలియక బ్రాందీ సేవించిన నాగరాజు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 31న మరణించాడు. దీంతో మరియమ్మ ఫిర్యాదుతో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.



