నయనతార: మైండ్ బ్లాకింగ్?

Nayanthara: కోలీవుడ్ బ్యూటీ నయనతార 40 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా 9 సినిమాలు ఉన్నాయి.ఇది సౌత్ హీరోయిన్ గా ఆల్ టైమ్ రికార్డు అనే చెప్పాలి.
బాలయ్య ‘అఖండ 2’ తర్వాత గోపీచంద్ మలినేని కాంబోలో రాబోయే చిత్రంలో హీరోయిన్ గా నయనతార పేరు బలంగా వినిపిస్తోంది. ఇది వీరిద్దరి నాలుగో కాంబినేషన్. గతంలో ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి సినిమాలు హిట్ అయ్యాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు నయన్‌ను సంప్రదించారు. 40 ప్లస్ ఏజ్‌లోనూ నయన్ అద్భుత ఫామ్‌లో ఉంది.
దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నాయికగా దూసుకుపోతుంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’సినిమాకి ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్. నయన్ చేతిలో ప్రస్తుతం 9 సినిమాలు ఉన్నాయి. తమిళం 4, మలయాళం 2, తెలుగు 2, కన్నడలో 1 ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో నయనతార తిరుగులేని తారగా దూసుకుపోతుంది.



